KCRతో ఉత్తమ్ మ్యాచ్ ఫిక్సింగ్: రాజగోపాల్ రెడ్డి

KCRతో ఉత్తమ్ మ్యాచ్ ఫిక్సింగ్: రాజగోపాల్ రెడ్డి

నాయకత్వలోపం తోనే… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి. తాను కరెక్ట్ గా మాట్లాడితే రాష్ట్ర నాయకులకు జీర్ణం కావడంలేదని చెప్పారు. గత శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడంతో కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించారని తెలిపారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ సీఎం కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

తనకు నిన్న అధిష్టానం షోకాజ్ నోటీసు ఇచ్చిందని చెప్పారు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే రాష్ట్ర ప్రజలే కాంగ్రెస్ నాయకత్వానికి షోకాజ్ నోటీస్ ఇచ్చే రోజులు వస్తాయని ఆయన అన్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని చెప్పారు. అయితే రాజ గోపాల్ ను బీజేపీ లో చేరుతారా అని రిపోర్టర్ అడుగగా… తాను ప్రాతినిధ్యం వహిస్తున్న  మునుగోడు నియోజక వర్గ ప్రజలు ఎలా చెప్తే అలా చేస్తానని రాజగోపాల్ అన్నారు.