
సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ను ఎడారిగా మార్చే 203 జీవో ను వ్యతిరేకిస్తున్నాం. జీవో కు కారణం తెలంగాణ ద్రోహి కేసీఆర్. కేసీఆర్ నీకు బుద్ధి ఉందా? జగన్ ను ప్రగతి భవన్ లో ఎలా అడుగు పెట్టనిచ్చావ్ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో 70శాతం పనులు అయిన ప్రాజెక్టులను పూర్తి చేయని అసమర్థుడు కేసీఆర్ అన్న కోమటిరెడ్డి…పద్ధతి ప్రకారం సీఎం దక్షిణ తెలంగాణ ను ఎండబెట్టే కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం లో 90శాతం పనులు పూర్తి చేసిన కేసీఆర్ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై అడిగే దమ్ము టిఆర్ఎస్ లో మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను బొంద పెట్టినా పాపం లేదు. వాడో పెద్ద జోకర్ సన్నాసి.. జగన్ తో కూర్చొనే పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు జీవో ఇచ్చారని అన్నారు. కేసీఆర్ ప్రతిపక్షం ఉందొ లేదో నీ బిడ్డను అడుగు..మేము బెదిరిస్తే భయపడం.ఏపీ జీవో పై ప్రధానిని కలుస్తాం, పార్లమెంట్ లో పోరాడుతామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..సీఎం కేసీఆర్ కు హెచ్చరికలు జారీ చేశారు.