కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సెలవు దినం భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయమే మల్లన్న పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. మల్లన్నకు బోనం సమర్పించి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు.

 పసుపు, కోరికలు తీర్చాలంటూ గంగరేగు చెట్టుకు ముడుపులు కట్టి వేడుకున్నారు. స్వామివారి దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది. మల్లన్న కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి కల్లు, బెల్లం పానకం పెట్టి  బోనం చెల్లించారు. భక్తుల కావల్సిన అవసరాలను ఈవో వెంకటేశ్, ఏఈవో శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్, ఎస్ఐ మహేశ్, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.