కొమురవెల్లి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం.. ఈ ఏడాది చివరికల్లా సిరిసిల్లకు రైలు వస్తుందని వెల్లడి

కొమురవెల్లి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం.. ఈ ఏడాది చివరికల్లా సిరిసిల్లకు రైలు వస్తుందని వెల్లడి

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న భక్తులకు రైలు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ నిర్మించిన రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌ను కేంద్రమంత్రులు కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్‌‌‌‌‌‌‌‌ దత్తాత్రేయ, ఎంపీలు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌, రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు, చామల కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ.. కొమురవెల్లికి రైలొచ్చిన ఈ రోజు నిజంగానే ఓ చరిత్రాత్మక దినమని, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో పాటు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇక ప్రయాణం చాలా ఈజీ అవుతుందని చెప్పారు. కేవలం రెండేండ్లలో ఈ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌ను నిర్మించినట్టు చెప్పారు. కొత్తపల్లి రూట్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం డీజిల్ రైళ్లు నడుస్తున్నాయని, త్వరలోనే రూ. 300 కోట్లతో విద్యుదీకరిస్తామన్నారు. కొమురవెల్లి నుంచి ఆలయం వరకు ప్రత్యేక బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 

ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 31లోగా సిరిసిల్లకు రైలు
పేదలకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక హంగులతో రైల్వే స్టేషన్లను నిర్మిస్తోందని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా సిరిసిల్లకు రైలు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది వేములవాడ, 2029 లోగా కొత్తపల్లి వరకు ఈ రైల్వే లైన్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 

హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు రూ. 500 కోట్లతో ఎంఎంటీఎస్ రైలును పొడిగిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేసి ఇవ్వాలని కోరారు. పాండురంగాపురం, భద్రాచలం రైల్వే లైన్ పనులను రూ. 3,500 కోట్లతో పూర్తి చేయడంతోపాటు తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణకు 5 వందే భారత్  ట్రైన్లను ఇచ్చామని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని తెలిపారు. 

దేశంలో 7 బుల్లెట్ ట్రైన్లలో 3 తెలంగాణకు రాబోతున్నాయని, తెలంగాణ అభివృద్ధిలో బుల్లెట్ ట్రైన్లు గేమ్ చేంజర్ కాబోతున్నాయని అన్నారు. ట్రిపుల్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి త్వరలోనే ప్రధాని మోదీ శుభవార్త అందిస్తారని చెప్పారు. 2047 నాటికి భారత్ 5 ట్రిలియన్ల ఎకానమీగా అభివృద్ధి చెందాలనేదే మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ. 5,024 కోట్లు కేటాయించినట్టు బండి సంజయ్​ తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి పట్ల మోదీ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. అంతకు ముందు కేంద్ర మంత్రులు కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి , బండి సంజయ్ కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి.. పట్నం వేశారు. రైల్వే స్టేషన్ ప్రారంభించిన అనంతరం అదే ట్రైన్‌‌‌‌‌‌‌‌లో కిషన్ రెడ్డి, రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు గజ్వేల్ వరకు ప్రయాణించారు. గజ్వేల్‌‌‌‌‌‌‌‌లో మంత్రి కిషన్​రెడ్డికి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

తీరనున్న భక్తుల ఇబ్బందులు
ఇప్పటివరకు కొమురవెల్లి మల్లన్న దర్శనానికి బస్సులు, ఓన్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌లోనే రావాల్సి వచ్చేది. ముఖ్యంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వస్తుంటారు. రాజీవ్‌‌‌‌‌‌‌‌ రహదారిపై బస్సు దిగి, అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడికి చేరుకోవాలన్నా, మళ్లీ ఇంటికి వెళ్లాలన్నా మెయిన్ రోడ్డుపై గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వచ్చేది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి దాదాపు 110 కిలోమీటర్లు, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ నుంచి 90 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేస్తూ రెండు మూడు బస్సులు మారాల్సి రావడం పెద్ద ప్రాబ్లమ్‌‌‌‌‌‌‌‌గా ఉండేది.

ఇప్పుడు కొత్త రైల్వేస్టేషన్ రావడంతో కొమురవెల్లితోపాటు చేర్యాల, మద్దూరు, ధూల్మిట్ట మండలాల ప్రజలకు కూడా రైలు అందుబాటులోకి వచ్చింది. రోజూ కాలేజీలు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, చిన్న వ్యాపారులు సుమారు 100 నుంచి 200 మందికి ఇది బాగా ఉపయోగపడనుంది.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వస్తే ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.200 వరకు, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ నుంచైతే రూ.100 నుంచి రూ.150 వరకు చార్జి అవుతున్నది. అదే ట్రైన్ జర్నీ అయితే ఈ ఖర్చు సగానికి సగం తగ్గుతుందని, టైమ్ కూడా కలసి వస్తుందని భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.