కొండగట్టులో అంజన్న జయంతి  ఉత్సవాలు.. భక్తులు ఇబ్బంది పడకుండా అధికారుల చర్యలు

కొండగట్టులో అంజన్న జయంతి  ఉత్సవాలు.. భక్తులు ఇబ్బంది పడకుండా అధికారుల చర్యలు
  • కొండగట్టు అంజన్న జయంతి ఉత్సవాలకు రండి 
  •     మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం 

కొండగట్టు,వెలుగు: కొండగట్టులో ఈనెల 10 నుంచి 12 వరకు జరిగే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను శనివారం ఈవో అంజనారెడ్డి ఆహ్వానించారు. శనివారం హైదరాబాద్‌‌‌‌లో జయంత్యుత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌‌‌‌ సునీల్, స్థానాచార్యుడు కపిందర్ తదితరులు ఉన్నారు.