బాంబు సైరన్ల మధ్య ఎలా ఆడాలి? సైప్రస్లో క్యాండిడేట్స్ చెస్‌ టోర్నీ నిర్వహణపై.. కోనేరు హంపి ఆగ్రహం

బాంబు సైరన్ల మధ్య ఎలా ఆడాలి? సైప్రస్లో క్యాండిడేట్స్ చెస్‌ టోర్నీ నిర్వహణపై.. కోనేరు హంపి ఆగ్రహం
  • ఫిడే తీరుపై తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెస్  టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వైదొలిగిన ఇండియా లెజెండ్ కోనేరు హంపి ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్(ఫిడే) తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు ఉన్న  సైప్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టోర్నీ నిర్వహించడంపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. వ్యక్తిగత భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నెల 28 నుంచి  జరిగే టోర్నీ నుంచి తప్పుకున్న హంపి తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. 

‘ద్వీప దేశమైన సైప్రస్ చుట్టూ యుద్ధనౌకలు పహారా కాస్తున్నాయి. లెబనాన్ నుంచి విమానంలో  కేవలం 20 నిమిషాల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి ఒక మహిళగా, ఫారినర్‌‌గా నేను ఎలా వెళ్లగలను? అక్కడ బాంబు సైరన్ల మధ్య ప్రశాంతంగా ఎలా ఆడగలను?’ అని హంపి ప్రశ్నించింది. బ్రిటీష్ ఎయిర్ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై డ్రోన్ దాడులు జరిగిన విషయాన్ని  తెలుపుతూ స్వయంగా సైప్రస్  ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూరోపియన్ యూనియన్ వద్ద భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు సైప్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లవద్దని లెవల్--3 ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. 

  • జరిమానాకు భయపడను

ఈ టోర్నీ కోసం గత మూడు నెలలుగా తన కూతురికి కూడా సరైన సమయం కేటాయించకుండా కష్టపడ్డానని, ఇంతటి ముఖ్యమైన టోర్నీని వదులుకోవడం తనకు సంతోషంగా ఏమీ లేదని హంపి ఆవేదన వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపి, తన భద్రత గురించి ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పుడు టోర్నీని మరో నెలకు వాయిదా వేయడమో లేదా వేదికను మార్చడమో చేయాల్సిందని హంపి అభిప్రాయపడింది.

 ‘అక్కడ అందమైన రిసార్టులు ఉన్నాయని ఫిడే చెబుతోంది. ఇండియాలో కూడా అలాంటి అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. రేపు జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఇలాగే టోర్నీలు నిర్వహిస్తారా? అందమైన రిసార్టులు ఉంటే సరిపోదు, ఆడేందుకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం ఉండాలి’ అని చురకలు అంటించింది. 

టోర్నీ నుంచి తప్పుకున్నందుకు సుమారు రూ. 9 లక్షల జరిమానా పడే అవకాశం ఉన్నా తాను భయపడటం లేదని తేల్చి చెప్పింది. అమెరికా చెస్ లెజెండ్ హికారు నకామురా కూడా సైప్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భద్రతపై సందేహాలను వ్యక్తం చేశాడు. మరోవైపు  హంపి విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా అవ్వడంతో ఖాళీ అయిన ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనా ముజిచుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఉక్రెయిన్‌)తో భర్తీ చేస్తున్నట్లు ఫిడే ప్రకటించింది.