నోయిడా: ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో ప్రారంభమైన ఆసియా యూత్, జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా పతకాల బోణీ చేసింది. శుక్రవారం జరిగిన విమెన్స్ 45 కేజీల విభాగంలో ఇండియా లిఫ్టర్ టిట్లి మాజి మూడు రజత పతకాలతో మెరిసింది.
స్నాచ్‌లో 65, క్లీన్ అండ్ జెర్క్‌లో 80 కేజీల బరువు ఎత్తిన టిట్లి ఓవరాల్‌గా 145 కేజీలు లిఫ్ట్ చేసి రెండో ప్లేస్‌లో నిలిచింది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌లోనూ టిట్లికి సిల్వర్ మెడల్స్ లభించాయి.
అయితే ఇండియాకే చెందిన పరిశమిత గొగోయ్ స్నాచ్‌లో 65 కేజీల బరువు ఎత్తి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 76 కేజీలకే పరిమితమైన గొగోయ్ మొత్తం 141 కేజీల బరువుతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
