ఆసియా పసిఫిక్‌లో హాటెస్ట్ ఎమర్జింగ్ డిజిటల్ బ్రాండ్‌ KOO యాప్

ఆసియా పసిఫిక్‌లో హాటెస్ట్ ఎమర్జింగ్ డిజిటల్ బ్రాండ్‌ KOO యాప్

ఎవరికి వారు తమ భాషలో అభిప్రాయాలను వ్యక్తం చేసేలా రూపొందిన యాప్.. Koo యాప్. APAC నుండి టాప్ 5 హాటెస్ట్ డిజిటల్ ఉత్పత్తులలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ యాప్..ప్రస్తుతం భారత్ లో లాంచ్ అయ్యింది. APAC, US తో పాటు EMEAలో ఎంతో గుర్తింపు పొందిన ఏకైక సోషల్ మీడియా బ్రాండ్ యాప్ కూ.

Koo యాప్ మార్చి 2020లో ప్రారంభించినప్పటి నుండి 20 నెలల స్వల్ప వ్యవధిలో 15 మిలియన్లకు పైగా వినియోగదారులను సంపాదించుకుంది. అంతేకాదు ఈ యాప్ 9 భారతీయ భాషలలో సేవలను అందించనుంది. రాబోయే ఒక ఏడాదిలో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటుతుందని  కూ, కో-ఫౌండర్ & CEO అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు.