హైదరాబాద్ బొల్లారంలో కొప్పెర్ట్ ప్లాంట్ ప్రారంభం..

హైదరాబాద్ బొల్లారంలో  కొప్పెర్ట్ ప్లాంట్ ప్రారంభం..

హైదరాబాద్​, వెలుగు: వ్యవసాయ రంగానికి సుస్థిర పరిష్కారాలు అందించే కొప్పెర్ట్ సంస్థ హైదరాబాద్  బొల్లారంలో మైకోరైజా ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఇది అగ్రిలైఫ్ ఇండియా, నెదర్లాండ్స్​కు చెందిన కొప్పెర్ట్ బీవీ ఉమ్మడి సంస్థ. భూమిలో సహజ సిద్ధమైన శిలీంధ్రాలను పెంచడం ద్వారా పంటలకు పోషకాలు అందేలా ఈ కేంద్రం సహకరిస్తుంది. దీనివల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గి మట్టి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేలా రైతులకు ఈ మైకోరైజా ద్రావణాలు ఉపయోగపడతాయని కొప్పెర్ట్ ​తెలిపింది. పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంలో భాగంగా ఈ కేంద్రాన్ని విస్తరించినట్లు పేర్కొంది.