Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మొదటి, చివరి సినిమాలివే.. పవన్ కల్యాణ్తో రిలీజ్ కానీ మూవీ ఇదే!

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మొదటి, చివరి సినిమాలివే.. పవన్ కల్యాణ్తో రిలీజ్ కానీ మూవీ ఇదే!

83 ఏళ్ల వయసులో కోట శ్రీనివాసరావు మరణ వార్తతో ఇండస్ట్రీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. గత మూడేళ్లుగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు (జులై 13న) తుది శ్వాస విడిచారు. కోట సినీ ప్రస్థానం మొదలు నుంచి చివరివరకు ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన నటించిన మొదటి మరియు చివరి సినిమా విశేషత సంతరించుకుంది. 

కోట శ్రీనివాసరావు మొదటి సినిమా 1978లో వచ్చిన ప్రాణం ఖరీదు. చిరంజీవి మొదటి సినిమా కూడా ఇదే. ప్రాణం ఖరీదు' చిత్రంతో ఆయన తాను ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించామని గుర్తు చేశారు కూడా చిరు.

ఈ క్రమంలోనే కోట శ్రీనివాసరావు నటించిన చివరి సినిమా ఆసక్తికరంగా మారింది. కోట శ్రీనివాస రావు చివరగా పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లులో నటించారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కోట వెల్లడించారు.

Also Read : మీరు వెళ్ళిపోయి ఉండొచ్చు.. కానీ, మీ పాత్రలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయి

పీరియడ్ డ్రామా వీరమల్లు సినిమాలో రెండు రోజులు పాటు షూటింగ్ చేశానని కోట తెలిపారు. అంతేకాకుండా తానూ అనారోగ్యంగా ఉన్నప్పటికీ.. కేవలం పవన్ కోసమే నటించినట్లు చెప్పారు. ఇపుడీ ఈ విషయం వైరల్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మెగా అన్నయ్యలతో కోట నటప్రస్థానం ఎప్పటికీ సుపరిచితం అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి, ఈ సినిమాలో కోట ఎలాంటి పాత్రలో నటించనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే, హరి హర వీరమల్లు మూవీ జూలై 31న విడుదల కానుంది. 

ఇకపోతే.. కోట శ్రీనివాసరావు తన 40 ఏళ్ల సినీ కెరీర్ లో తెలుగు,హిందీ, కన్నడ,మలయాళంలో మొత్తం750కి పైగా సినిమాల్లో నటించారు. విలన్, కమోడియన్, తండ్రిగా ఇలా ఎన్నో రకాల పాత్రలకు ఆయన జీవం పోశారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనకు గానూ 9 నంది అవార్డులు, ఒక సైమా అవార్డు గెలుచుకున్నారు. 2015లో కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో కోటని సత్కరించింది.