కోవిషీల్డ్ తయారీకి మేం రెడీ

కోవిషీల్డ్ తయారీకి మేం రెడీ

న్యూఢిల్లీ: ఆక్స్‌‌ఫర్డ్‌‌ యూనివర్శిటీ–ఆస్ట్రాజెనికా డెవలప్‌‌ చేసిన కరోనా వ్యాక్సిన్‌‌ కోవిషీల్డ్‌‌ను తయారు చేయడానికి, భవిష్యత్‌‌ అవసరాల కోసం నిల్వ చేసుకోవడాకి ప్రభుత్వం నుంచి అనుమతులొచ్చాయని సీరమ్‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ప్రకటించింది. వ్యాక్సిన్‌‌ ట్రయల్స్‌‌ విజయవంతం అయితే ఈ వ్యాక్సిన్‌‌ను కమర్షిలైజ్  చేస్తారు. కోవిషీల్డ్ ‌‌ఇంకో 73 రోజుల్లో లాంఛ్‌ అవుతుందనే రిపోర్స్‌‌  వెలువడడంతో సీరమ్‌ ఇన్‌‌స్టిట్యూట్‌ ‌స్పందించింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌‌పై ఫేజ్‌ 3 ట్రయల్స్‌‌ జరుగుతున్నాయని, ఈ ట్రయల్స్‌‌ పూర్తయ్యాక కోవిషీల్డ్‌‌ అందుబాటుపై అధికారికంగా ప్రకటన చేస్తామని సీరమ్‌ పేర్కొంది. కరోనా వ్యాక్సిన్‌ వివరాలకోసం వెబ్‌సైట్‌.. ఇండియాలో, గ్లోబల్‌‌గా డెవలప్‌‌అవుతున్న కరోనా వ్యాక్సిన్లను గురించి తెలుసుకునేందుకు మెడికల్‌‌ రీసెర్చ్‌‌సంస్థఐసీఎంఆర్‌‌‌‌త్వరలో ఓ వెబ్‌సైట్‌‌ను లాంఛ్ చేయనుంది. ఈ వెబ్‌ సైట్‌‌లో ప్రస్తుతం డెవలప్‌‌అవుతున్న కరోనా వ్యాక్సిన్ల వివరాలను ప్రొవైడ్‌ చేస్తారు. ఈ వెబ్‌సైట్‌‌ఇంగ్లీష్గ్లీ‌తో పాటు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. గ్లోబల్‌‌అలయెన్స్‌‌ఫర్‌‌‌‌ వ్యాక్సిన్స్‌‌, ఇమ్యునైజేషన్‌‌(గ వీ), బిల్ ‌‌అండ్‌ మిలిందా గేట్స్ ‌‌ఫౌండేషన్‌‌తో సీరమ్‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఈ నెల ప్రారంభంలో పారన్టర్‌‌‌‌షిప్‌‌కు దుర్చుకుంది. ఇండియా, తక్కువ ఆదాయ దేశాలకు 100 మిలియన్‌‌కరోనా వ్యాక్ సిన్‌‌డోస్‌లను సప్లయ్‌ చేయాలని ఈ సంస్థలు టార్గెట్‌‌గా పెట్టుకున్నాయి.