
- కాంగ్రెస్‌పై కేపీ వివేకానంద్ గౌడ్ ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరక్క, తమ పార్టీ నాయకులను పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇస్తున్నారని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ ఆరోపించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రే నేరుగా ఇతర పార్టీల నాయకుల ఇండ్లకు వెళ్లి, వాళ్ల పార్టీలోకి ఆహ్వానించడం ఇంతకుముందెప్పుడూ చూడలేదన్నారు. కేటీఆర్ భాష గురించి మాట్లాడే ముందు, సీఎం రేవంత్‌రెడ్డి భాష గురించి మాట్లాడాలని డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్కకు సూచించారు. రేవంత్‌కు ట్యూషన్ పెట్టి పాఠాలు నేర్పాలని అన్నారు.