వర్ధన్నపేట, వెలుగు: రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. శనివారం వర్ధన్నపేట పట్టణంలో 38 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 58 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు.
అనంతరం నియోజవర్గ పరిధిలోని 150 మంది అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో విజయ్ సాగర్, ఎంపీడీవో వెంకటరమణ, మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
