తొలి విజిలెన్స్ కమిషనర్గా నందన్ నియామకం

తొలి విజిలెన్స్ కమిషనర్గా నందన్ నియామకం

హైదరాబాద్, వెలుగు: స్టేట్ విజిలెన్స్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా రిటైర్డ్ ఐపీఎస్ కేఆర్ నందన్‌‌‌‌‌‌‌‌ను మరోసారి నియమిస్తూ రాష్ట్ర సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2015 మార్చిలో తెలంగాణ విజిలెన్స్​కమిషన్​ ఏర్పాటవ్వగా.. తొలి విజిలెన్స్​కమిషనర్ గా నందన్ నియమితులయ్యారు. ఈ ఏడాది మార్చి 13న ఆయన పదవీకాలం ముగిసింది. అయితే, మరో రెండేళ్లు ఆయననే  కమిషనర్​ గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 1975 బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు చెందిన నందన్ ఉమ్మడి ఏపీలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. అంతకు ముందు ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీఎఫ్) డెరైక్టర్‌‌‌‌‌‌‌‌గా కూడా ఆయన పనిచేశారు.