
కృష్ణమ్మ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో….వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద కొనసాగుతుండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. సోమవారం 4 గేట్లు ఎత్తిన అధికారులు… మంగళవారం 6 గేట్లను 23 అడుగుల మేర ఎత్తి… నీటిని విడుదల చేశారు. 3 లక్షల 90 వేల 830 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 4లక్షల 24వేల 652 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ రిజర్వాయర్ లోకి విడుదల చేశారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2 వేల 400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2 వేల 26 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి 28 వేల 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో పాటు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలకు 80 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 855 అడుగులు కాగా …ప్రస్తుతం 854.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జునసాగర్ గేట్లు కూడా ఓపెన్ చేశారు అధికారులు. 23 గేట్ల ద్వారా పులిచింతలకు నీటిని విడుదల చేశారు. ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తారు. నాగార్జునసాగర్ కు 3 లక్షల 77 వేల 300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా … 2 లక్షల 94 వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు.
సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.2 అడుగులకు చేరింది. సాగర్ నిండు కుండలా మారడంతో కుడి, ఎడమ కాల్వలకు నీటిని ఫుల్ గా విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ సాగర్ నుంచి రెండు లక్షలకు పైగా పులిచింతలకు నీరు వస్తుండటంతో… ముంపు గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూడు అడుగుల మేరు నీళ్లు వచ్చి చేరాయి. దీంతో లోకల్ అధికారులు అలర్ట్ అయ్యారు. ముంపు గ్రామాల ప్రజలు అలర్ట్ గా ఉండాలంటున్నారు.