'కృష్ణ వ్రిందా విహారి' రిలీజ్ డేట్ ఖరారు

'కృష్ణ వ్రిందా విహారి' రిలీజ్ డేట్ ఖరారు

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా, హీరోయిన్ గా పరిచయం కాబోతున్న షిర్లీ సేథియా హీరోయిన్ గా నటించిన 'కృష్ణ వ్రిందా విహారి' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్న ట్టుగా మూవీ నిర్వాహకులు ప్రకటించారు. అనీష్‌ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదల చేసిన టీజర్, పాటలకు సైతం మంచి టాక్ వస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య బ్రహ్మణ యువకుడిగా అలరించనున్నాడు. మహతి స్వర సాగర్‌ సంగీతం అందించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధికా శరత్‌ కుమార్‌ ఓ కీలక పాత్ర పోషించనున్నారు.