హరీష్ రావుతో ఆర్. కృష్ణయ్య భేటీ

 హరీష్ రావుతో ఆర్. కృష్ణయ్య భేటీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ లో రూ.20వేల కోట్లు బీసీలకు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ కు సబ్సిడీ రుణాల కోసం రూ.4వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. బీఆర్కేఆర్ భవన్ లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ను కలిసిన ఆర్ కృష్ణయ్య.. ఎంబీసీ కార్పొరేషన్ కు రూ.2వేల కోట్లు కేటాయించాలని కోరారు. ధరల పెరుగుదల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలేజీ హాస్టల్ విద్యార్ఖుల మెస్ ఛార్జీలు నెలకు రూ.1500 నుంచి రూ.2500, గురుకుల పాఠశాల విద్యార్థుల ఆహారపు ఛార్జీలు 8 నుంచి 10వ తరగతి వారికి రూ.1100నుంచి రూ.2వేలు, 3వ తరగతి నుంచి 7వ తరగతి వారికి రూ.950 నుంచి రూ.1600కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. బీసీ అడ్వకేట్లకు ఇచ్చే స్టయిఫండ్ నెలకు రూ.1000 నుంచి 10వేలకు పెంచాలని కృష్ణయ్య కోరారు. బీసీ స్టడీ సర్కిల్ కు రూ.200 కోట్లు కేటాయించాలని, కోచింగ్ పద్దతులు మార్చాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహాలు చేసుకునే బీసీ కులాల వారికి ప్రోత్సాహక పారితోషికం రూ.2లక్షల 50వేలకు పెంచాలన్నారు. బీసీ కాలేజి విద్యార్థులకు పాకెట్ మనీ నెలకు రూ.500 మంజూరు చెయ్యాలని కోరారు.