కృష్ణమ్మ మూవీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ వీడియో ద్వారా అనౌన్స్

కృష్ణమ్మ మూవీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ వీడియో ద్వారా అనౌన్స్

సత్యదేవ్  హీరోగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’.  కొరటాల శివ సమర్పణలో  వీవీ  గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు.  కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు.  షూటింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసిన టీమ్, శుక్రవారం ఈ మూవీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ను  డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. ఇందులో సత్యదేవ్ రాజమండ్రి సెంట్రల్  జైలులో ఖైదీగా కనిపిస్తున్నాడు. ఇంతలో మరో ఖైదీ వచ్చి  తన రిలీజ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాపీని చూపిస్తూ.. ‘భద్ర రిలీజ్ అవబోతున్నాం రా’ అని చెప్పడంతో ఎప్పుడు అంటూ చిత్రంలోని  తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కనిపించాడు. మే 3న ఈ సినిమా విడుదల కానుందని  ప్రకటించిన వీడియో ఆకట్టుకుంది. సత్యదేవ్  రగ్డ్ లుక్‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు.  విజయవాడలో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్, ఓ విలన్‌‌‌‌‌‌‌‌కి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా అని చెప్పారు మేకర్స్.