'కృష్ణమ్మ' టైటిల్ సాంగ్ రిలీజ్ 

'కృష్ణమ్మ' టైటిల్ సాంగ్ రిలీజ్ 

టాలీవుడ్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కృష్ణమ్మ'. కృష్ణ కొమ్మాలపాటి నిర్మాణంలో గోపాలకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సత్యదేవ్ సరసన అథిర రాజీ హీరోయిన్ గా నటించింది. కొరటాల శివ సమర్పిస్తున్న ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగును రిలీజ్ చేశారు మేకర్స్. 

"కృష్ణమ్మా కృష్ణమ్మా నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషం. ఈ కొమ్మా ఆ రెమ్మా చల్లాయి గంధాలేవో మాపై ఈ నిమిషం" అంటూ ఈ పాట సాగుతోంది. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడాడు. హీరోతో పాటు ముడిపడిన కొన్ని ముఖ్యమైన పాత్రలను, అతని ప్రయాణానికి సంధించిన సన్నివేశాలను ఈ వీడియోలో చూడొచ్చు. ఈ టైటిల్ సింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.