బీసీ బిల్లు పెట్టే వరకు ఉద్యమం ఆగదు : ఆర్.కృష్ణయ్య

బీసీ బిల్లు పెట్టే వరకు ఉద్యమం ఆగదు : ఆర్.కృష్ణయ్య

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు బీసీల ఉద్యమం ఆగదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో జనాభా ప్రకారం వాటా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సుదీర్ఘ కాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న 15 డిమాండ్లపై గత వారం రోజులుగా ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పలు రాజకీయ పార్టీలకు చెందిన 70 మంది ఎంపీలను కలిసి మద్దుతు కూడబెట్టినట్లు చెప్పారు.  సమావేశంలో మల్లు రవి, హనుమంతరావు, గుజ్జ కృష్ణ ఉన్నారు.