V6 News

భువనగిరిలోని కృష్ణవేణి టాలెంట్స్కూల్ హవా

 భువనగిరిలోని కృష్ణవేణి టాలెంట్స్కూల్ హవా

యాదాద్రి, వెలుగు: భువనగిరిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది.  మొత్తం 21 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు.  

జే. ప్రీతికా రెడ్డి 570 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఎస్. హాస్యశ్రీ 555, ఎస్. సుప్రియ సాయి 554, ఎస్. అభయ్ 550 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.  ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.