ప్రభాస్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కృతిసనన్

ప్రభాస్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కృతిసనన్

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌,హీరోయిన్ కృతిసనన్‌ డేటింగ్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతకొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.  బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ ఈ రూమర్స్ ను మరో స్ధాయికి తీసుకెళ్లాయి. అయితే ఈ వార్తలకు కృతిసనన్‌ చెక్ పెట్టింది. ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. వరుణ్ ధావన్ అటపట్టించడానికి అలా అన్నాడని తెలిపింది.  ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని ఫోస్ట్ చేసింది.  

మరోవైపు ఈ వరుణ్ ధావన్ పై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సినిమా ప్రమోషన్‌ కోసం మా అన్న పేరుని ఇంతలా వాడుతున్నారేంటి?’ అంటూ మండిపడుతున్నారు. ప్రభాస్‌-, కృతిసనన్‌ కలిసి ఆదిపురుష్‌ మూవీలో కలిసి నటిస్తున్నారు. ఇందులో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతిసనన్‌ కనిపించనున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని  టి. సిరీస్ బ్యానర్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సినిమా పై భారీ అంచనాలున్నాయి.