మెగా ఇంటి కోడలిగా కృతిశెట్టి?

మెగా ఇంటి కోడలిగా కృతిశెట్టి?

ఉప్పెన(Uppena) బ్యూటీ కృతి శెట్టి(Kriti shetty) మెగా ఇంటి కోడలు కానుందనే వార్త నెట్టింట వైరల్​గా మారింది. ఈ వార్త ఎప్పుడు ఎక్కడ పుట్టుకొచ్చిందో తెలియదు గానీ సోషల్​ మీడియాలో ఇందుకు సంబంధించిన గాసిప్స్​ గుప్పుమంటున్నాయి. లావణ్య త్రిపాఠి(Lavanya tripathi), వరుణ్​ తేజ్(Vaarun tej)​పై కూడా మొదట ఇలాంటి వార్తలే వచ్చాయి. తర్వాత ఈ రూమర్లను నిజం చేస్తూ ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.

Also Read :- ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. అవన్నీ రూమర్స్

ఇప్పుడు మరో మెగా హీరో వైష్ణవ్​ తేజ్​తో కృతి ప్రేమలో ఉన్నదనే వార్త ట్రెండింగ్​గా మారింది. ఉప్పెన సినిమా టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అంటున్నారు. ఈ వార్తలపై ఈ ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాల్లో నటించిన కృతి ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గంతో ఫెయిల్యూర్​ చూసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.