ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. అవన్నీ రూమర్స్

ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. అవన్నీ రూమర్స్

జవాన్(Jawan) సినిమాలో దీపికా పదుకునే(Deepika padukone) అతిథి పాత్రలో మెరిసింది. అయితే, ఈ సినిమా కోసం ఆమె భార రెమ్యూనరేషన్​ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా దీపిక స్పందించింది. ‘ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో గెస్ట్​ రోల్స్​చేశాను. అందులో రణ్‌వీర్‌ సింగ్(Ranvir singh) ‘83’, సర్కస్​ సినిమాలు ఉన్నాయి. అలాగే జవాన్​లో నటించాను.

Also Read :- రిలీజ్​కి ముందే భయపెడుతోంది.. నిజంగా అంత మ్యాటర్ ఉందా?

షారుక్​ ఖాన్​(Shah rukh khan) నాకు మంచి ఫ్రెండ్​. ‘జవాన్‌’లో నా రెమ్యూనరేషన్​ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. నేను ఆ సినిమా కోసం రూపాయి కూడా తీసుకోలేదు. 83 సినిమాలో మహిళలు ఎన్ని త్యాగాలు చేస్తారో చూపించారు. అందుకే అందులో నటించాలనుకున్నా’ అని దీపికా వెల్లడించింది. ఇక తనపై వచ్చే నెగిటివిటీని చాలా లైట్​ తీసుకుంటానని పేర్కొంది.