చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి

మదురై: చిన్నారులు సోషల్ మీడియాను వినియోగించడంపై ఆంక్షలు విధిస్తూ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు (మదురై బెంచ్) సూచించింది. 16 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడాన్ని నిషేధిస్తూ ఆస్ట్రేలియా చట్టం తీసుకొచ్చిందని, అలాంటి చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలించాలని సిఫారసు చేసింది. సోషల్ మీడియా వినియోగంతో పిల్లలకు విచ్చలవిడిగా పోర్నోగ్రఫీ కంటెంట్ అందుబాటులో ఉంటున్నదని, దీన్ని అరికట్టేందుకు మన దేశంలోనూ ఆస్ట్రేలియా లెక్క చట్టం తేవాలని కోరుతూ ఎస్‌‌‌‌‌‌‌‌.విజయ్‌‌‌‌‌‌‌‌ కుమార్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జి.జయచంద్రన్, కేకే రామకృష్ణన్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. 

ఈ సందర్భంగా కేంద్రానికి బెంచ్ కీలక సూచనలు చేసింది. ‘‘చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధిస్తూ ఆస్ట్రేలియా లెక్క చట్టం తెచ్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి. అంతవరకు సోషల్ మీడియా అనర్థాలపై అవగాహన కల్పించాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలి” అని బెంచ్ సూచించింది.