రిలీజ్​కి ముందే భయపెడుతోంది.. నిజంగా అంత మ్యాటర్ ఉందా?

రిలీజ్​కి ముందే భయపెడుతోంది.. నిజంగా అంత మ్యాటర్ ఉందా?

బాలీవుడ్​ బ్యూటీ కంగనా రనౌత్​(Kangana Ranaut) టైటిల్​ రోల్​లో ‘చంద్రముఖి–2(Chandramukhi2)’ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే సెన్సార్​ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 28న థియేటర్లలోకి తేనున్నారు. అయితే, ఈ మూవీ రన్​టైం ఆడియెన్స్​ను రిలీజ్​కి ముందే భయపెడుతోంది. 

Also REad :- సల్మాన్ ఖాన్ జోడీగా సమంత.. భారీ స్కెచ్ వేసిన కరణ్ జోహార్

ఏకంగా 2 గంటల 50 నిమిషాల నిడివితో ఈ మూవీ ఫైనల్​ కట్​ ఉండనుందని ప్రకటించారు. సినిమాలో కథ, కథనాలు.. ఇతర సాంకేతిక అంశాల వంటివాటితో పాటు నటీనటుల పెర్​ఫార్మెన్స్​ ఎంతో బలంగా ఉంటేనే అన్ని గంటల సినిమాను ప్రేక్షకులు చూడగలరు. ఇప్పుడు ఈ మూవీ టీం కాన్ఫిడెన్స్​ చూస్తుంటే నిజంగానే ఇందులో అంత మ్యాటర్ ఉందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి చంద్రముఖిగా కంగనా ఏ మేరకు ప్రేక్షకులను ఎంగేజ్​ చేస్తుందో చూడాలి.