సల్మాన్ ఖాన్ జోడీగా సమంత.. భారీ స్కెచ్ వేసిన కరణ్ జోహార్

సల్మాన్ ఖాన్ జోడీగా సమంత.. భారీ స్కెచ్ వేసిన కరణ్ జోహార్

సౌత్ స్టార్ బ్యూటీ సమంత(Samantha) త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కెరీర్ లో వరుస ప్లాప్స్ తో కాస్త డల్ గా ఉన్న సమంత.. రీసెంట్ గా ఖుషి(Kushi) సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. విజయ్ దేవరకొండ(Vijay devarakonda) హీరోగా వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె బాలీవుడ్ లో ఫుల్ లెంత్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదికూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు జోడీగా. పవన్ కళ్యాణ్ తో పంజా సినిమాను తెరకెక్కించిన స్టైలీష్ డైరెక్టర్ విష్ణువర్ధన్ తో.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read :- ఈ కోటి రూపాయల ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా?

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో సల్మాన్ కు జోడీగా సమంతను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత కరణ్ జోహార్. ఇటీవలే జవాన్ సినిమాలో షారుఖ్ జోడీగా సౌత్ బ్యూటీ నయనతార నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ.. కరణ్ జోహార్ సల్మాన్ ఖాన్ పక్కన సౌత్ హీరోయిన్ ను పెట్టాలని నిర్ణయించుకున్నాడట. అందుకే ఈ సినిమా కోసం సమంతను తీసుకోవాలని అనుకుంటున్నారట. మరి జవాన్ సెంటిమెంట్ కరణ్ అండ్ సల్మాన్ కంబోకు వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.