ఎమ్మెల్యే చోరీపై రాహుల్ సిగ్గుపడాలి : కేటీఆర్

ఎమ్మెల్యే చోరీపై రాహుల్ సిగ్గుపడాలి : కేటీఆర్
  • కేటీఆర్ ట్వీట్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఎమ్మెల్యేల చోరీ జరుగుతున్నదని..దీనిపై రాహుల్ గాంధీ వెంటనే స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. "జాతీయ స్థాయిలో  ఓట్​ చోరీ గురించి నీతులు చెబుతున్న రాహుల్ గాంధీ, తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేల చోరీ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ఎమ్మెల్యేల చోరీ అనేది ఓటు చోరీ కంటే దారుణమైన నేరం" అని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.