
జమ్ము కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా శ్రీనగర్ ఎన్‌ఐటి క్యాంపస్‌ను విద్యార్థులు తక్షణమే ఖాళీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం నిర్ణయంతో తీవ్ర ఆందోళన చెందిన తెలంగాణ విద్యార్థులు తమకు సాయం చేయలంటూ ట్విట్టర్ లో TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల కష్టాలపై KTR వెంటనే స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరికీ ఇబ్బంది కలగకుండా అందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకొస్తుందని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులను శ్రీనగర్ నుంచి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహాయం కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరీని సంప్రదించాలని కోరారు. అక్కడి కార్యాలయానికి సంబంధించిన ఫోన్ నంబర్లు 011-2338 2041 లేదా +91 99682 99337 కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.