చేతకాని ప్రభుత్వం మాటలు తప్ప.. చేతలు లేవు.. : కేటీఆర్

చేతకాని ప్రభుత్వం మాటలు తప్ప.. చేతలు లేవు.. : కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని మాటలు తప్ప.. చేతలు లేవని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మల్లాపూర్ వీఎన్అర్ గార్డెన్ లో ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు బీఅర్ఎస్ సీనియర్ నాయకులు భద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, తాండూరు శ్రీనివాస్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యాభై వేల మెజారిటీ తో గెలిపించిన ఉప్పల్ నియోజక వర్గ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు నెరవేర్చకుండా.. అబద్దాలు మాట్లాడుతున్నారని.. ఇచ్చిన  ఏ హామీని నెరవేర్చలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 రోజులలో అన్ని హామీలు నెరవేర్చుతాము అన్నారు.. అప్పటివరకు ఏం చేస్తారో చూద్దామన్నారు. ప్రజలు మనకు రెండు సార్లు అవకాశం కల్పించారు.. రాజకీయాల్లో చీకటి వెలుగులు సర్వ సాధారణమని అన్నారు కేటీఆర్.