హోం క్వారంటైన్‌పై ప్రచారం కేటీఆర్ పిలుపు

హోం క్వారంటైన్‌పై ప్రచారం కేటీఆర్ పిలుపు

హైదరాబాద్ , వెలుగు: హోం క్వారంటైన్ పై  వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గైడ్ లైన్స్ ను ప్రచారం చేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ ఫొటోను ట్వీట్​లో జత చేశారు. హోం క్వారంటైన్ , సెల్ఫ్ ఐసోలేషన్ హ్యాష్ ట్యాగ్ లను పోస్ట్ చేశారు.

ప్రొసీజర్  ఫాలో అవ్వండి

తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇండియా వస్తానన్న ఇన్ఫోసిస్ ఉద్యోగి ట్వీట్ కు మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘సర్ నా తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇండియా వస్తున్నా. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉండి ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నా. క్వారంటైన్ చేయకుండా ఉండటానికి నాకు సాయం చేస్తారా’ అని కేఎన్ పీ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ ‘ మీకు, మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. మీరు మీ కుటుంబంతో ఉండేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. కానీ క్వారంటైన్ , సెల్ఫ్ ఐసోలేషన్ విధానాలు పాటించండి. మీ కాంటాక్ట్ వివరాలు మా ఆఫీస్ కు పంపండి’ అని సమాధానమిచ్చారు.

విదేశాల్లో చిక్కుకున్నవాళ్లను తీసుకురండి

యూకే, ఇటలీ, ఫిలిప్పీన్స్, సెయింట్ లూసియాలో చిక్కుకున్న మన స్టూడెంట్స్​ నుంచి తనకు రోజూ మెస్సేజ్​లు  వస్తున్నాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయా దేశాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీలను అప్రమత్తం చేయటంతో పాటు బాధితులను ఆదుకోవాలని కేంద్ర మంత్రులు జైశంకర్ , హర్​దీప్ సింగ్ పూరికి ఆయన విజ్ఞప్తి చేశారు.