విడాకులకు బ్రేక్: కుదిరిన పాకెట్ మనీ అగ్రిమెంట్, నెలకు రూ.15వేలు..!

విడాకులకు బ్రేక్: కుదిరిన పాకెట్ మనీ అగ్రిమెంట్, నెలకు రూ.15వేలు..!

ఈ రోజుల్లో యువతకు సహనం చాలా తక్కువగా ఉంటోంది. అందుకే పెళ్లైన కొన్ని నెలలకే వారి జీవితాల్లో కలహాలు ఏర్పడుతూ కాపురం చేయలేమంటూ విడిపోతున్నారు. ఇంట్లో తల్లిదండ్రుల నుంచి కోర్టులు వరకు జంటలు విడిపోకుండా వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే వివాహ సంబంధాలను కాపాడగలుగుతున్నారు. 

అయితే ఇటీవల అర్థాంతరంగా ముగియాల్సిన ఒక ప్రేమ జంట వైవాహిక జీవితాన్ని వారు తిరిగికొనసాగించటానికి అంగీకరించటంపై సుప్రీం కోర్టు కూడా సంతోషం వ్యక్తం చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ముంబై, జౌన్ పూర్ ప్రాంతాలకు చెందిన ప్రేమ జంట వివాహం చేసుకుంది. అంతే పెళ్లైన నాలుగు నెలలకే వారి కాపురంలో వచ్చిన కలహాలు వారిని విడిపోయేలా చేశాయి. ఈ క్రమంలో వారు ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకున్నారు. చివరికి వ్యవహారం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. వారి కేసు విన్న న్యాయమూర్తి కూడా వారిద్దరు కలిసుండటం కష్టమని అర్థం చేసుకున్నారు. కేసును సాగతీయటం కంటే ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవటం మంచిదని సూచించారు.

Also Read : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లు సిగ్గుపడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్..

అయితే కేసును మధ్యవర్థిత్వానికి పంపిన కొన్ని నెలలకే ఆశ్చర్యకరమైన అంగీకారం వారిద్దరి నుంచి రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈసారి విడాకులకు బదులు వారిద్దరూ అంగీకరించిన ఒక అగ్రిమెంట్ కోర్టు ముందుకు వచ్చింది. అగ్రిమెంట్ ప్రకారం భర్త ప్రతినెల భార్యకు ఖర్చులకోసం రూ.15వేల యూపీఐ పేమెంట్ చేసేందుకు అంగీకరించారు. అలాగే ఇంటి పని, వంట పని చేసేందుకు సహాయకురాలిని ఏర్పాటుకు కూడా వారు అంగీకరించారు. ఇదే క్రమంలో ఇద్దరి ఫ్యామిలీలు జంటను సంతోషంగా ఉంచేందుకు వారికి ఏకాంత సమయాన్ని అందించాలని, వారి మధ్య బంధం బలపడేందుకు అది దోహదపడుతుందని భావించారు.

అలాగే ఇప్పటి వరకు ఒకరిపై మరొకరు పెట్టుకున్న అన్ని కేసులను వెనక్కి తీసుకోవాలని, ఇప్పటి వరకు జరిగినదంతా మరచిపోయి ముందుకు సాగాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. మెుత్తానికి విడాకుల వరకు వెళ్లిన ప్రేమ జంట వైవాహిక జీవితం చివిరికి వారు కూర్చుని మాట్లాడుకోవటం వల్ల తిరిగి చిగురించింది. వారి బంధం బలపడేందుకు కుటుంబం కూడా సహకారం అందించటానికి ముందుకు రావటం సమస్యను సులువుగా పరిష్కరించగలిగింది. జంట తీసుకున్న నిర్ణయంపై జస్టిస్ పార్థివాలా బెంచ్ కూడా హర్షం వ్యక్తం చేసింది.