కాంగ్రెస్ 6 గ్యారంటీలు కాదు..420 హామీలు : కేటీఆర్

కాంగ్రెస్ 6 గ్యారంటీలు కాదు..420 హామీలు : కేటీఆర్

పార్లమెంట్ సెగ్మెంట్లపై బీఆర్ఎస్ ముఖ్య నేతల రివ్యూ కొనసాగుతోంది. ఇవాళ నిజామాబాద్ లోక్ సభ సీటు సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. హైదరబాద్ తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన మీటింగ్ జరుగుతోంది. పార్టీ సీనియర్ నేతలు,  నిజామాబాద్ లోక్ సభ స్థానం పరిధిలోని ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు అటెండయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ని పరిశీలిస్తే... పార్టీ ఓట్లవారీగా నిజామాబాద్ పార్లమెంట్ మొదటి స్థానంలో ఉందన్నారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ కన్నా బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు. ఎంపీ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందన్నారు నేతలతో చెప్పారు కేటీఆర్.

అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం... గట్టిగా కొట్లాడాలన్నారు కేటీఆర్. ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. బీఆర్ఎస్ కు ఎన్నికల్లో గెలుపు, ఓటములు కొత్త కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలుగా ఇచ్చిన హామీల ఇచ్చిందన్నారు. 6 గ్యారంటీలు కాదు... 420 హామీలని ఫైరయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా హామీలపై మాట దాటేస్తుందని విమర్శించారు కేటీఆర్. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అప్పులు, శ్వేత పత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తుందని ఫైరయ్యారు. దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మీతో పాటు  సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేస్తే లబ్ధిదారులతో కలిసి పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు కేటీఆర్.