రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఖండించిన కేటీఆర్

రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఖండించిన కేటీఆర్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఆయనపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడమేనని ఆరోపించారు. అత్యంత అప్రజాస్వామిక పద్దతిలో రాహుల్ పై వేటు వేశారని కేటీఆర్ అన్నారు. ఇది తొందరపాటు చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్ తత్తవేత్త వాల్ టేర్, జర్మన్ థియాలజిస్ట్ మార్టిన్ నిమాలర్ కోట్స్ ను మంత్రి కేటీఆర్ జత చేశారు. రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ సపోర్టు చేస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్ సభ సెక్రటరీ జనరల్ ప్రకటించింది. ప్రధాని మోడీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మార్చి 23న సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఆదేశాల నేపథ్యంలోనే రాహుల్ గాంధీపై వేటు వేసినట్టు లోక్ సభ వెల్లడించింది. ఇక పార్టీ నాయకుడిపై ఈ రకమైన చర్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/KTRBRS/status/1639220827362328576