పరువునష్టం కేసు విచారణకు రాని కేటీఆర్..స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్ వాయిదా

పరువునష్టం కేసు విచారణకు రాని కేటీఆర్..స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్ వాయిదా

హైదరాబాద్‌‌, వెలుగు : మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ పై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. స్టేట్ మెంట్ రికార్డ్ చేసేందుకు సమయం ఇచ్చినా ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించింది. వాంగ్మూలం నమోదు చేస్తామని చెప్పినప్పటికీ మళ్లీ సమయం ఎందుకు అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. 

కేటీఆర్ తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఈ నెల 23న స్టేట్ మెంట్ రికార్డ్ చేసేందుకు అంగీకరించింది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో కేటీఆర్ ఈ నెల 3న పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు.