
హైదరాబాద్: హైదరాబాద్ కు మోడీ చేసిందేమీ లేదని విమర్శించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి కావాల్సింది చౌకీదార్ కాదు జిమ్మేదార్ అని చెప్పారు. ఇన్నాళ్లూ దేశానికి అన్యాయం చేసిన కాంగ్రెస్…. ఇప్పుడు న్యాయ్ పథకం తెస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు కేటీఆర్. మల్కాజ్ గిరి నియోజవర్గానికి సంబంధించి కొంపల్లిలో జరిగిన మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడారు. హైద్రాబాద్ శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు కేటీఆర్. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని పేరు మార్చి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అమలు చేస్తున్నారని అన్నారు. ఏపీలో కూడా రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ పేరిట పథకం ప్రవేశ పెట్టారని అన్నారు కేటీఆర్.