
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గత కొన్నాళ్లుగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో వరదలు ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాలతో జంట జలాశయాలు హుస్సేన్ సాగర్, హిమయత్ సాగర్ పూర్తిస్థాయిలో నిండిపోయాయి. నిండుకుండలా మారడంతో జలమండలి అధికారులు వాటి గేట్లను ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేస్తు న్నారు.
హిమాయత్ సాగర్ కు భారీగా వరద పెరగడంతో మూసీలోకి 12 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దాంతో మూసీ నది ఉప్పొంది ప్రవహిస్తున్నది. ముసారాంబాగ్ బ్రిడ్జీ పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచి పోయాయి.