War 2 Review: ఎన్టీఆర్-హృతిక్ ‘వార్ 2’ X రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

War 2 Review: ఎన్టీఆర్-హృతిక్ ‘వార్ 2’ X రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ (War 2). కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. అయాన్ ముఖర్జీ తెరెకెక్కించాడు. ఇవాళ (ఆగస్టు 14న) వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓవర్సీస్లో ఒకరోజు ముందుగానే (ఆగస్టు 13న) సాయంత్రం వార్ 2 విడుదలైంది. అక్కడ సినిమా చూసిన ఆడియన్స్ తమ రివ్యూలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. భారీ అంచనాలతో వచ్చిన వార్ 2 ఎలా ఉంది? ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఎంట్రీ ఎలా ఉంది? వీరిద్దరి యాక్షన్ సీన్స్, డ్యాన్సులు ఎలా ఉన్నాయనేది X రివ్యూలో చూద్దాం.

‘వార్ 2’ కథ:

ఫస్ట్ పార్ట్ 'వార్' కథ అందరికీ గుర్తే ఉండుంటుంది. పార్ట్1 వార్లో కబీర్ ధాలివాల్ (హృతిక్ రోషన్) ఇండియన్ రా ఏజెంట్గా పనిచేస్తాడు. దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసే సత్తా కలిగిఉంటాడు. అయితే, కొన్ని పరిస్థితుల తర్వాత రోగ్ ఏజెంట్ (మోసగాడిగా) కింద మారతాడు. అప్పటి నుండి దేశంలోని అత్యంత డేంజరస్ క్రిమినల్స్లో ఒకరిగా ఎదుగుతాడు.

Also Read:-రజనీకాంత్ ‘కూలీ’ ఓవర్సీస్ రివ్యూ.. కుర్చీ కోసం నాగార్జున యుద్ధం.. మైండ్ బ్లాక్ అయ్యే స్టోరీ ఇదే!

ఈ క్రమంలో 'వార్ 2' లో కబీర్ ధాలివాల్ని వలలో వేసే పాకిస్తానీ ఏజెంట్ రోల్లో కియారా నటించినట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కానీ, ట్రైలర్లో మాత్రం కియారా ఇండియన్ ఆర్మీ అన్నట్టుగా కనిపించింది. ఇదిలా ఉంటే ..కబీర్ నుంచి పెరుగుతున్న బెదిరింపులకు ప్రతిస్పందనగా విక్రమ్ను (ఎన్టీఆర్) భారత ప్రభుత్వం స్పెషల్ యూనిట్స్ ఆఫీసర్గా పంపుతుంది. కబీర్‌ను పట్టుకునే క్రమంలో విక్రమ్ ఎటువంటి యుద్ధం చేశాడనేది 'వార్ 2' సినిమా కథ అని అంటున్నారు.  

వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరి ఎంట్రీలు అదిరిపోయాయట. ఫస్టాఫ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉందని, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు హైలెట్ అని ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సెకండాఫ్లో రెగ్యులర్ స్పై థ్రిల్లర్గా సాగిందని ట్వీట్స్ పెడుతున్నారు. కానీ, సెకండాఫ్లో కొన్నిచోట్ల వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ అదిరిపోయాయని అంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ వచ్చే సీన్స్లో విజిల్స్, పేపర్స్ పడటం కన్ఫామ్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.