Coolie X Review: రజనీకాంత్ ‘కూలీ’ ఓవర్సీస్ రివ్యూ.. కుర్చీ కోసం నాగార్జున యుద్ధం.. మైండ్ బ్లాక్ అయ్యే స్టోరీ ఇదే!

Coolie X Review: రజనీకాంత్ ‘కూలీ’ ఓవర్సీస్ రివ్యూ.. కుర్చీ కోసం నాగార్జున యుద్ధం.. మైండ్ బ్లాక్ అయ్యే స్టోరీ ఇదే!

రజనీకాంత్- నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’(Coolie).కీలక పాత్రల్లో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్ నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ ఇవాళ (ఆగస్ట్ 14న) థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఉదయం 7 తర్వాతే షోలు పడనున్నాయి.

అయితే, ‘కూలీ’ మూవీ ఒకరోజు ముందే బుధవారం (ఆగస్ట్ 13న) సాయంత్రం 6:30 EST (4 am IST)కి ప్రదర్శించారు. అక్కడ మూవీ చూసిన ఆడియన్స్, సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూస్ పంచుకుంటున్నారు. భారీ తారాగణంతో వచ్చిన ‘కూలీ’ ఎలా ఉంది? లోకేష్ యూనివర్స్లో మరో హిట్గా నిలిచిందా? లేదా అనేది X రివ్యూలో తెలుసుకుందాం. 

దేవా (రజనీకాంత్), రాజశేఖర్ (సత్యరాజ్) మంచి స్నేహితులు. ఇందులో రాజశేఖర్ ఓ కుర్చీని తయారు చేస్తాడు. ఆ కుర్చీ కోసం సైమన్ (నాగార్జున)తో పాటు మరికొందరు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే సత్యరాజ్ కూతురైన ప్రీతి (శృతి హాసన్) ఒక ఆపదలో పడుతుంది. అందుకు స్నేహితుడి బిడ్డ కోసం రజనీకాంత్ రంగంలోకి దిగుతాడు. అంతేకాకుండా కొన్నిచోట్ల ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది.

Also Read:-ఎన్టీఆర్-హృతిక్ ‘వార్ 2’ X రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

ఈ క్రమంలో దేవా ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి? సైమన్తో (నాగార్జున), దేవా మొదలుపెట్టిన యుద్ధం ఎలాంటిదనేది ప్రధాన స్టోరీగా చెబుతున్నారు. అయితే, ఈ సినిమాలో ప్రతి పాత్ర మొదలయ్యేది ఒక కథతోనే.. అందువల్ల ఇందులో అనేక ఉపకథలు ఉన్నాయని.. కనుకే, ఆడియన్స్ స్టోరీ మొత్తం రివీల్ చేయట్లేదు. కూలీ ట్రైలర్లో సైతం ఓ కుర్చీ కనపడుతుంది. అసలు అసలు ఆ కుర్చీలో ఏముంది? అనేది మిగతా స్టోరీ.

మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్, అది సెకండాఫ్కి ఇచ్చే 'హై'.. ఆడియన్స్లో ఆసక్తి రేకిత్తిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా నాగార్జున స్టైలిష్ విలనిజం, రజినీ ఎలివేషన్స్ ఆడియన్స్కు మంచి బూస్ట్ ఇస్తుందని అంటున్నారు. ఓవరాల్గా లోకేష్ కనగరాజ్ తన స్క్రీన్ ప్లే, ఎలివేషన్లు, అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్తో సినిమా మొత్తం నింపేశాడని నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. 

దేవాగా-సైమన్ మధ్య జరిగే యుద్ధంలో దహా (అమీర్ ఖాన్), కలీషా (ఉపేంద్ర), దయాళ్ (సౌబిన్ షాహిర్) పాత్రలేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.  'కూలీ' చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించగా.. అనిరుధ్ సంగీతం అందించాడు.