OTTలోకి 'జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ'.. ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

OTTలోకి 'జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ'..  ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

టైటిల్ వివాదంతో విడుదలకు ముందే అందరి దృష్టిని ఆకర్షిస్తూ సంచలనం సృష్టించిన చిత్రం 'జానకి V vs స్టేట్ ఆఫ్ కేరళ.   సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈయాక్షన్ థ్రిల్లర్ డ్రామా జూలై 10న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్ టాక్ అందుకుంది. ఇప్పుడు OTTలో విడుదల రెడీ అయింది.

కథాంశం 
ఈ మూవీలో జానకి V అనే బెంగళూరుకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ (అనుపమ పరమేశ్వరన్ )  చూట్టూ కథ తిరుగుతుంది.వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రికోసం  కేరళకు తిరిగి వస్తుంది.  అయితే కేరళకు తిరిగి వచ్చిన తర్వాత అత్యాచారానికి గురవుతుంది. ఈ ఘటన ఆమె జీవితాన్నే మార్చేస్తుంది.  దీంతో ఆమె న్యాయం కోసం పోరాటం చేస్తుంది. ఈ సమయంలోనే అడ్వకేట్ డేవిడ్ అబెల్ డోన్ వన్ ( సురేష్ గోపి ) ప్రవేశంతో ఆమె పోరాటం నాటకీయంగా మలుపు తిరుగుతుంది. అయితే ఈ చిత్రం ఎటువంటి ప్రభావం చూపలేకపోయిందని అభిమానులు విమర్శిస్తున్నారు.  

ఈ చిత్రంలో సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు.  కోర్టు డ్రామా రక్తికట్టిస్తూ ఉత్కంఠభరితంగా సాగుతోంది.  అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకు చక్కగా న్యాయం చేశారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

ALSO READ : 'వార్ 2' ఫుల్ రివ్యూ

ఇక ఈ మూవీలో దివ్య పిళ్లై, శ్రుతి రామచంద్రన్, అస్కర్ అలీ, బైజు సంతోష్  తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించి, రాసిన ఈ చిత్రానికి రేనాదివే అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. గిరీష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.  జూలై 17న థియేటర్లలో విడుదలైన  'జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ' చిత్రం ఇప్పుడు OTTలో విడుదల కానుంది.  స్వాతంత్య్ర దినోత్సవాన్ని పుష్కరించుకుని ఆగస్టు 15న జీ5( Z5) లో స్ట్రీమింగ్ కానుంది.