బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టులో విచారణ.. విగ్రహాల భద్రతపై కోర్టు కీలక ఆదేశం

బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టులో విచారణ.. విగ్రహాల భద్రతపై కోర్టు కీలక ఆదేశం

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతలపై హైకోర్టు విచారణ చేపట్టింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 12 లో ఉన్న పెద్దమ్మ గుడి కూల్చివేతపై  గురువారం (ఆగస్టు 14) విచారణ చేపట్టిన హైకోర్టు.. విగ్రహాల భద్రతపై ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని భద్రంగా దాచాలని అధికారులను ఆదేశించింది. 

పెద్దమ్మ తల్లి విగ్రహం కూల్చివేత పై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు.  ఈ కేసులో తదుపరి విచారణ ను ఆగస్టు 18 కి వాయిదా వేసింది హైకోర్టు.

పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ నమోదైంది. అక్రమంగా కూల్చిన ఆలయాన్ని తక్షణమే నిర్మించాలని పల్లె వినోద కుమార్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. గురువారం (ఆగస్టు 14) మధ్యాహ్నం విచారించిన కోర్టు.. విగ్రహాన్ని భద్రపరిచి.. కూల్చితేలకు గల ఆధారాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

బంజారాహిల్స్ లోని పెద్దమ్మగుడి కూల్చివేతపై కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. కూల్చివేతకు నిరసనగా హిందూ సంఘాలు కుంకుమార్చాన పూజకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. హిందు సంఘాల పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంజారాహిల్స్‌కు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్దమ్మగుడి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. పెద్దమ్మ తల్లి దేవాలయానికి వెళ్లే మార్గాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని.. అటు వైపు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు.