
Bitcoin: ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఏకైక పెట్టుబడి ప్రస్తుతం క్రిప్టో. ఇందులోనూ ప్రధానంగా హాట్ కేకులా అమ్ముడుపోతున్నది బిట్‌కాయిన్ మాత్రమే. అవును దీనిని 2009లో సతోషి నకమోటో అనే వ్యక్తి దాదాపు సున్నా విలువతో ప్రారంభించాడు. కానీ ఇవాళ ఒక్కో బిట్‌కాయిన్ రేటు ఏకంగా కోటి రూపాయలు దాటేసింది. అంటే దీనిని ప్రారంభించినప్పుడు ఒక్క రూపాయి పెట్టుబడిగా పెట్టి ఉంటే ప్రస్తుతం కోటీశ్వరులుగా మారారు కొందరు ఇన్వెస్టర్లు.
2010లో బిట్‌కాయిన్ తన ర్యాలీని స్టార్ట్ చేసింది. అప్పట్లో ఒక్కో కాయిన్ రేటు జస్ట్ రూ.8 మాత్రమే. కానీ 2013 నాటికి దాని విలువ వెయ్యి డాలర్లు అంటే 87వేల రూపాయలకు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టోలకు వస్తున్న ప్రత్యేక గుర్తింపు.. అమెరికా, లండన్, థాయిలాండ్ వంటి దేశాల్లో క్రిప్టో ఈటీఎఫ్ లకు వస్తున్న గుర్తింపు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. పైగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్రిప్టోలకు అనుకూలంగా పాలసీలను రూపొందించటం.. అలాగే ఆయన ఫ్యామిలీ కూడా క్రిప్టోల వ్యాపారంలో ఉండటంతో ఆధునిక కాలంలో ఇదొక ప్రత్యేక అసెట్ క్లాస్ గా గుర్తింపును దక్కించుకుంటోంది.
ప్రధానంగా క్రిప్టో కరెన్సీలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై పనిచేస్తుంటాయి. అందుకే దీనిని డిజిటల్ ప్రపంచంలో బంగారంగా పిలుస్తుంటారు. ప్రస్తుతం క్రిప్టోలపై బ్యాంకులు, ప్రభుత్వాల కంట్రోల్ లేనపోవటమే దానికి పాపులారిటీని తెచ్చిపెట్టింది. కానీ భారత్ లాంటి దేశాలు వీటిని పర్యవేక్షణ అవసరమని, దీనిని అసాంఘిక కార్యకలాపాలను వినియోగించకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. క్రిప్టో కరెన్సీల ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై జరుగుతున్నందున వాటి సెక్యూరిటీ గురించిన బాధ్యతలు మైనింగ్ చేసిన వ్యక్తులు చూసుకోవాల్సి ఉంటుంది.
ALSO READ : తక్కువ డబ్బుతో ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలా..?
క్రిప్టో మైనింగ్ చేసే వ్యక్తులు కంప్యూటర్లు అందించే సమస్యలను పరిష్కరించినప్పుడు వారికి బదులుగా బిట్ కాయిన్స్ ఇవ్వబడతాయి. దీనినే క్రిప్టో మైనింగ్ అని అంటుంటారు. క్రిప్టోల విషయంలో కేవలం ఒక్కరిపైనే పూర్తి బాధ్యత ఉండదు కాబట్టి వీటి విషయంలో అప్రమత్తత అవసరం. కేవలం 2కోట్ల 10 లక్షల బిట్ కాయిన్స్ మాత్రమే మైనింగ్ చేసే అవకాశం ఉంది. సప్లై పరిమితిగా ఉండటం కూడా దీని రేటును అమాంతం పెంచేస్తోందని నిపుణులు చెబుతున్నారు. రోజులో 24 గంటలు ట్రేడింగ్ కి అందుబాటులో ఉండటం కారణంగా దీనిలో ఎక్కువ ఓలటాలిటీ ఉంటుంది. చాలా మంది విదేశాలకు తక్కువ ఖర్చులో డబ్బు పంపటానికి క్రిప్టోలను వినియోగిస్తున్నారు.