V6 News

డిలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే దక్షిణాదిలో మరో ఉద్యమం తప్పదు : కేటీఆర్

డిలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే దక్షిణాదిలో  మరో ఉద్యమం తప్పదు : కేటీఆర్

డిలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాదికి అన్యాయం జరిగితే పెను ఉద్యమం తప్పదని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, మూడేళ్ల క్రితం తీసుకున్న దృఢమైన నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.

తామంతా గర్వించదగ్గ భారతీయులమని.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలమని తెలిపిన కేటీఆర్.. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని విమర్శించారు.

►ALSO READ | రామగుండంలో త్వరలో అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌ సెంటర్ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

దేశ అత్యున్నత వేదిక అయిన పార్లమెంటులో మా ప్రజల స్వరాన్ని అణచివేయాలని చూస్తే.. తాము నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకోబోమని, దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా ఢిల్లీ పాలకులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని, విజ్ఞత ప్రదర్శించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.