
రాష్ట్ర మంత్రివర్గాన్ని ఈ సాయంత్రం విస్తరించనున్నారు సీఎం కేసీఆర్. సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. కొత్త మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. రాజ్ భవన్, జీఏడీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఆరుగురు మంత్రులను కేబినెట్ లో చేర్చుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ నాయకులు వీళ్లే.
1) కేటీఆర్
2) హరీష్ రావు
3) గంగుల కమలాకర్
4) సత్యవతి రాథోడ్
5) సబితా ఇంద్రారెడ్డి
6) పువ్వాడ అజయ్.
నాయకులు మంత్రులుగా ప్రమాణం చేశాక.. వారికి కేటాయించిన శాఖలపై సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేస్తుంది. ఆ తర్వాత వారి శాఖల్లో మంత్రులు బాధ్యతలు తీసుకుంటారు.
ఇప్పటికే ఈ ఆరుగురు నాయకులకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. జిల్లాలనుంచి నాయకులు తమ అనుచరులు, కార్యకర్తలతో హైదరాబాద్ వచ్చారు.