- ఆయన గోల్డెన్ జూబ్లీ పెండ్లి వేడుకలు కొత్త పెండ్లిని తలపిస్తున్నాయి
- కేటీఆర్ చమత్కారాలు
కీసర, వెలుగు: మల్లారెడ్డి అంటే హంగామా.. హంగామా అంటేనే మల్లారెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్లారెడ్డి, ఆయన భార్య కల్పన పేర్లను కలిపి ఇకపై మల్పనగా పిలుద్దామని చమత్కరించారు. ఈ నెల 19న మాజీ మంత్రి మల్లారెడ్డి 50వ పెండ్లి రోజు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కీసరలో కందాడి శ్రీకాంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సీఎంఆర్ క్రికెట్ ట్రోఫీని ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మట్లాడుతూ.. మల్లారెడ్డి50వ పెండ్లి రోజు వేడుకలు కొత్త పెండ్లిని తలపిస్తున్నాయని, హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలతో సందడి చేయబోతున్నారన్నారు. ఈ టోర్నీలో విజేతలకు రూ. లక్ష, రన్నరప్‌కు రూ. 50 వేల బహుమతులు అందజేయనున్నట్లు మల్లారెడ్డి తెలిపారు.
