
వెలుగు: టీఆర్ఎస్ లోక్ సభ సన్నాహక సమావేశాలకు సర్వం సిద్ధమమైంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధ వారం నుంచి ఈనెల 17వరకు 16ఎంపీ స్థానాలను చుట్టేయనున్నారు. తొలిరోజున ఉదయం 11.45 గంటలకు
కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సుమారు 20 వేల మంది కార్యకర్తలు, నేతలు ఇందులో పాల్గొననున్నారు.
భారీ ర్యాలీగా ..
కేటీఆర్ బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. మార్గమధ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సరిహద్దులోని శ నిగ రం నుంచి కరీం నగర్ శివార్లలోని అల్గునూరు చౌరస్తా వ ర కు భారీగార్యాలీ గా వస్తారు. అక్కడ పార్టీ జెం డాను ఆవిష్కరించి, ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ సమావేశంలో కా ర్యకర్తలతో మాట్లాడి ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయం తీసుకుంటారు. కరీంనగర్‌కు ఇచ్చిన హామీల అమలుకు తీసుకున్న చర్యలను, టీఆర్ ఎస్ ప్రభుత్వ ప్రాధాన్యా లను వివరిస్తారు. పార్టీ 16 మంది ఎంపీలను గెలుచుకుం టే కేంద్రంలో చేకూరే ప్రయోజ నాల పై కా ర్యకర్తలకు దిశానిర్దేశంచేస్తారు.
ఉత్తర తెలంగాణ భవన్ లో బస
కార్యకర్తలతో స మావేశం తర్వాత కేటీఆర్ ఉత్తర తెలంగాణ భ వ న్‌లో ఉమ్మడి కరీం నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలతో భేటీ అవుతారు. నేతల మధ్య ఉన్న అంతరాలు, ఇతర అంశాల పైనా చర్చించే అవకాశముంది. రాత్రికి కేటీఆర్ అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం వరంగల్‌కు చేరుకుంటారు. అక్కడ ఎంపీ కెప్టెన్ ల క్ష్మీకాంతరావు నివాసంలో ముఖ్య నేతలతో సమావేశమవుతారు. తర్వాత సన్నాహక సమావేశానికి హాజరవుతారు. మధ్యాహ్నం భువనగిరికి వె ళ్లి సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో భేటీ అయి.. హైద రాబాద్‌కు తిరిగి చేరుకుంటారు. తర్వాత కూడా వరుసగా సన్నాహక సమావేశాలు జరుగనున్నాయి .
జనంలోకి వెళ్లాలి
రాష్ట్రంలోని అన్ని లోక్ సభ స్థానాల పరిధిలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, నెరవేర్చినవి, పెండింగ్ లో ఉన్నవేమిటన్న అంశాలను కేటీఆర్ పరిశీలిస్తారు. ఇప్పుడు గెలిపిస్తే ఏం చేయబోయేది, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజల వద్దకు వెళ్లి ఈ అంశాలను ఎలా చెప్పాలన్న దానిపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు.