
మంత్రి కేటీఆర్ కరీంనగర్ టూర్ షెడ్యూల్ ను రిలీజ్ చేశారు అధికారులు. మంగళవారం ఉదయం 9.15 గంటలకు కేటీఆర్ హెలికాప్టర్ లో కరీంనగర్ కు చేరుకుంటారు. 9.30 గంటలకు కేసీఆర్ (కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్) పేరుతో నిర్మించిన గెస్ట్ హౌస్ ను, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 11 గంటలకు హన్మకొండ జిల్లా కమలాపూర్ కు వెళ్తారు. 12 గంటలకు కమ్యూనిటీ హాల్స్ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు.
12.30 గంటలకు మహాత్మాజ్యోతీభా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు(బాలికలు, బాలురు వేర్వేరుగా) ప్రారంభిస్తారు.తర్వాత జూనియర్ కళాశాల, కేజీబీవీ జూనియర్ కళాశాలను కేటీఆర్ ప్రారంభిస్తారు. ఒంటి గంటకు కమలాపూర్ లో లంచ్ ముగించుకుని హెలికాప్టర్ లో తిరిగి కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు వస్తారు. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటారు. అక్కడి నుంచి హుజురాబాద్ కు వెళ్లి హెలికాప్టర్ లో తిరిగి హైదరాబాద్ వెళ్తారు.