పేద ప్రజల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

పేద ప్రజల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

రంగారెడ్డి జిల్లా: పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా
జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మౌలిక సదుపాయాల కల్పించే
విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని కేటీఆర్ చెప్పారు. ఇందులో భాగంగానే శివారు ప్రాంతాల్లోనూ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వైకుంఠ
ధామాలు, పార్కులు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో రూ.4.50 కోట్ల నిధులతో
చేపట్టనున్న సమీకృత మార్కెట్, మంచినీటి పైప్ లైన్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

మరిన్ని వార్తల కోసం..

త్వరలోనే ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు

మీ పాలనలో నిరుద్యోగం పెరిగింది నిజం కాదా..?