త్వరలోనే ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు

త్వరలోనే ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు

తిరుమల: కరోనా వ్యాప్తి మొదలయ్యాక తిరుమల శ్రీవారి భక్తులు నేరుగా కొండకు వెళ్లి అక్కడే సర్వ దర్శనం టోకెట్లు తీసుకుని స్వామి దర్శనం చేసుకునే వీలు లేకుండా పోయింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకుని మాత్రమే అతి కొద్ది మంది శ్రీవారి దర్శనం చేసుకోగలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సామాన్య భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రకియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ కారణంగా ఉద్యోగులు, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని  విధిలేని పరిస్థితిలో ఆన్‌లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

గ్రామాల్లో ఉండే భక్తులు ఇబ్బంది పడుతున్నరు

కొవిడ్ వ్యాప్తి భయంతో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకెన్లు జారీ చేసే విధానాన్ని గత ఏడాది సెప్టెంబరు 25 నుంచి రద్దు చేశామని, ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ, అవి గ్రామాల్లో ఉండే సామాన్య భక్తులకు అందక ఇబ్బందిపడుతున్నట్లు తెలిసిందని  టీటీడీ చైర్మన్ అన్నారు. మళ్లీ సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుపతిలో  ఆఫ్‌లైన్ విధానంలో సర్వదర్శన టోకెన్ల జారీ ప్రారంభించాలని అనేక సార్లు భావించినా కరోనా వేవ్‌ల కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించారు. 

ఫిబ్రవరి 15 తర్వాత రిస్టార్ట్‌ చేసే చాన్స్

ఫిబ్రవరి 15 నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని  నిపుణులు చెబుతున్నందున, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 15 వరకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లను విడుదల చేశామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 15 వరకు కొవిడ్ పరిస్థితిని అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్రంలో ఫిబ్రవరి 15 నుంచి స్కూళ్లు రీఓపెన్?

కేసీఆర్ను ముట్టుకుంటే భస్మం అయితరు

కింగ్ కోబ్రాతో పోరాటం మాములుగా లేదు