అందరికీ సమాన హక్కులు ఉండాలన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు ఎంతో గొప్పవని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు మంత్రి కేటీఆర్. 130వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. త్వరలోనే నగరంలోని నడి బొడ్డున అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అందరికీ సమాన హక్కులు ఉండాలని బాబాసాహెబ్ చెప్పారన్న కేటీఆర్.. బోధించు, సమీకరించూ, పోరాడు అని అన్నారని తెలిపారు. ఏ సమానత్వం కోసమైతే అంబేద్కర్ పోరాడారో దానిని సాధించే దిశగా .. దాదాపు వెయ్యి గురుకులాలు స్థాపించామన్నారు. వాటిద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు మంచి అవకాశాలు అందిస్తూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చెప్పారు కేటీఆర్.
